అధికారంలోకి రాబోయేది కూటమి ప్రజా ప్రభుత్వమే

  • మహిళా విభాగం బలోపేతానికి కమిటీలు వేసాం
  • రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, తిరుపతి ఎంపీగా వెలగపూడి వరప్రసాద్ లను కూటమి తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ వీరమహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని అధ్యక్షతన వీరమహిళా విభాగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని మండలాల మహిళా కమిటీలు వేయడం జరిగింది. వెంకటాచలం మండల వీరమహిళా అధ్యక్షురాలిగా సందూరు సాయి శ్వేతా, మండల ఉపాధ్యక్షురాలిగా వలిపి కావేరి, ముత్తుకూరు మండల వీర మహిళా అధ్యక్షురాలిగా మన్నేపల్లి మస్తానమ్మ, పొదలకూరు మండల వీర మహిళా అధ్యక్షురాలిగా గురుపర్తి కామాక్షి రాకేష్ లను నియమించడం జరిగింది. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వీర మహిళా విభాగాన్ని 25 మంది మహిళలతో కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలోగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా మహిళా శక్తిని తయారుచేసి, భవిష్యత్తులో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ వీరమహిళా విభాగం బలంగా ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుంది. వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు విపరీతంగా జరిగాయి. రాబోయే ప్రజా ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తుంది. వైసిపి రాక్షస పాలనలో మహిళల హక్కులపై పోరాటం చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అండగా నిలిచారు. అలాంటి మహిళా శక్తిని బలోపేతం చేయడమే జనసేన పార్టీ లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి పై నమ్మకంతో నేడు సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో వాళ్లందరిని కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునే దానికి నా వంతు నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలిగా నియమితులైన నాగరత్నం గారిని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాగరత్నం గారికి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, వీరమహిళా నాయకురాలు కంటే లక్ష్మి, జయసుధ, ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శి రహీం, అశోక్, మస్తాన్, సుమన్, చిన్న, నవీన్, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, చెంచయ్య, రామిరెడ్డి, పొదలకూరు మండల నాయకులు సంజు రాకేష్, మనుబోలు మండల నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.