జనసేన ద్వారానే రాజ్యాంగ ఫలాలు దళితులకు చేరతాయి

రాజోలు, 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉయ్యూరి వారి మెరకకు చెందిన యూత్ సభ్యులతో కలిసి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలతో నివాళులర్పించి, గణతంత్ర వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇన్నాళ్ళు గణతంత్ర భారతదేశంలో రాజ్యాంగ ఫలాలు దళితులకు అందక అణగద్రోక్కబడటం పై జనసేన పార్టీ తరుపున దళిత నాయకులుగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలపై చర్చించేందుకు, నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు పార్టీకి చెందిన దళిత నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, సెట్టిం శ్రీనివాస్, కుసుమ నాని, బందెల శరత్ రాయ్, బాలం రాంబాబు లు, మలికిపురం సఖినేటిపల్లి మండలాలకు చెందిన జనసేన పార్టీ దళిత ప్రజా ప్రతినిధులైన కాకర శ్రీనివాస్, మేడిది సరోజ, దొండపాటి సుజాత, రాపాక సత్యనారాయణ లను అలాగే నల్లి వెంకటేశ్వరరావు ని కలవటం జరిగింది. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజా ప్రతినిధులను పూలమాలలతో సత్కరించి తదుపరి జనసేన పార్టీని దళిత సామాజిక వర్గంలో బలోపేతం చేసే దిశగా చర్చలు సాగాయి.