గిరిజనుల కిడ్నీ సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకెళ్లిన మనుబోలు

*తిరువూరు నియోజకవర్గంలోని ఏ. కొండూరు పరిసర ప్రాంత గిరిజనులు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యల గురించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు

ఏ కొండూరు: గత దశాబ్ద కాలంగా ఏ కొండూరు మండలం మరియు గంపలగూడెం మండలంలోని గిరిజన తండాలలో లంబాడి ప్రజలు తమ గిరిజన తండాల్లో విలయతాండం చేస్తున్న కిడ్నీ వ్యాధి గురించి ఆదివారం విజయవాడలో జరిగిన జనవాణి కార్యక్రమం ద్వారా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఉమ్మడి కృష్ణ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు తీసుకెళ్లడం జరిగింది. ఆదివారం ఆయన ఏ కొండూరు గంపలగూడెం మండలాల్లోని గిరిజన తండాల్లోని కిడ్నీ వ్యాధి బాధితులతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జనవాణి సభా వేదిక ప్రాంగణం దిగి బాధితుల వద్దకే స్వయంగా వచ్చి కూర్చొని అర్థగంటకు పైగా వారితో మాట్లాడి సమస్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఏ కొండూరు పరిసర ప్రాంతాల్లో జనాలు కిడ్నీ వ్యాధికి గురై చనిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం చాలా బాధాకరమని గతంలో శ్రీకాకుళం లోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ సమస్యపై జనసేన పార్టీ బాధితులు తరఫున బలంగా పోరాడిందో అదే విధంగా భవిష్యత్తులో త్వరలోనే ఈ ఏ కొండూరు పరిసర ప్రాంత గిరిజన తండాలలోని కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతానికి జనసేన టీం ను పంపుతామని ఈ సందర్భంగా బాధితులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.. త్వరలోనే ఈ విషయం గురించి కిడ్నీ వ్యాధి అధికంగా ఉన్న ప్రాంతంలో తమ బృందం పర్యటించి సమగ్రమైన సమాచారం సేకరించి సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్యకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే విధంగా కిడ్నీ వ్యాధి బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు మరొకసారి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు గత పది సంవత్సరాలు నుంచి కిడ్నీ వ్యాధి బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ కి వివరించడం జరిగిందన్నారు. ఇదే సందర్భంగా రామచంద్రపురం గ్రామంలోని జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రామాలయం సమస్య గురించి ఫలాలు కోల్పోతున్న బాధితులు గురించి వారి ఎదుర్కొంటున్న సమస్యల గురించి స్థానికులతో కలిసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ కొండూరు మండలం, గంపలగూడెం మండలం కిడ్నీ వ్యాధి బాధితులు ఏ కొండూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు లాకావతు విజయ్, గంపలగూడెం మండలం పార్టీ ఉపాధ్యక్షుడు జరపల రామకృష్ణ, వెంపాటి ఏసయ్య, పసుపులేటి సతీష్, లాకావతు వెంకటేశ్వరరావు, వెంపాటి పవన్, రావుల కోటేశ్వరరావు ముదిగొండ సాయి కృష్ణ, సిద్ధం శెట్టి రవీంద్ర, వి కోటి, డి.సాయి, మరీదుశివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.