బోదె పూడిక తీయించాలని హెచ్చరించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నగర పాలక సంస్థ 18వ డివిజన్ వంగాయగూడెంలో ఉన్న పంట బోదె పూడికను తొలగించాలని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గత నెల 6వ తేదీన ధర్నా చేసిన సంగతి విధితమే. కృష్ణా కెనాల్ నుండి బాపెస్టు వారి పేట, గొల్లాయగూడెం, వంగాయ గూడెం, సుబ్రహ్మణ్యం కాలనీ మీదుగా పోణంగికి వెళ్లే పంట బోదెను మురికి బోదెగా మార్చేశారని, వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశుభ్రత అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ డివిజన్లో ఈ పంట బోదె పూర్తిగా చెత్త వ్యర్థాలతో నిండిపోయింది. ప్రక్కనే ఉన్న నుయ్యి సైతం పాడైపోయింది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నానికి, మేయర్ కి, కమిషనర్ కి, సిబ్బందికి మీడియా రూపంలో ఈ విషయాన్ని బహిర్గతం చేశామని, స్థానిక ఎమ్మెల్యే, మేయర్, డివిజన్ కార్పొరేటర్ గాని 18వ డివిజన్ మురుగు కాలువ సమస్యను పెడచెవున పెట్టారు. ఈ డివిజన్లోని పారిశుధ్య సమస్యలు పరిష్కరించని పక్షంలో తామే స్వచ్ఛందంగా మురుగును తొలగించే కార్యక్రమానికి ఆచరణకు దిగుతామని అధికార పార్టీ నేతలను, అధికారులను హెచ్చరించడం జరిగింది. అయినా వారిలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లోపించిందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమీషనర్ జిల్లా కలెక్టర్ వివరించినట్లు జనసేన పార్టీకి లేఖ పంపి చేతులు దులుపుకున్నారు. కానీ 18వ డివిజన్ లో పంటబోదే మురుగు కాలువ సమస్య పరిష్కారం కాలేదు, ఈనెల 7వ తేదీలోగా ఈ డివిజన్లో పంట బోదే మురుగు కాలువలో తూడును తొలగించకపోతే తామే స్వయంగా మురుగును తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చేయాలని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం అని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ముక్కు పిండి ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు పంట కాలువలోని పూడికను తొలగించక పోవడంతో డివిజన్లో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల వద్ద నుండి జీతాలు తీసుకుంటున్న అధికారులు, గౌరవ వేతనము తీసుకుంటున్న మేయర్, ప్రభుత్వ ధనంతో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యే 18వ డివిజన్ సమస్యలపై ముఖం చాటేయడంపై నాయకులకు డివిజన్ ప్రజల ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో ప్రజలకు అవగత మైందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ డివిజన్ సమస్యలపై తక్షణమే సమస్యలకు పరిష్కారం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.ఈనెల 6వ తేదీ వరకు మీకు గడువు ఇస్తున్నాం. లేని పక్షంలో 7వ తేదీ నుండి జనసేన పార్టీ తరఫున ఆ మురికి కాలువలోని వ్యర్ధాలను తొలగిస్తామని జనసేన పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీకు చలనం ఉంటే బాధ్యత ఉంటే ప్రజల ఓటుతో గద్దెనెక్కిన మీకు నైతిక విలువలు అనేవి ఉంటే ఇప్పటికైనా స్పందించాలని లేనిపక్షంలో ఈ విషయాన్ని జనసేన పార్టీ సీరియస్ గా తీసుకుని తామే తొలగింపుకు స్వచ్ఛందంగా డివిజన్ ప్రజలను కలుపుకొని మురుగు తొలగింపుకు పూనుకుంటామని జనసేన పార్టీ హెచ్చరించింది.