మొగలి లోవరాజుకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి గ్రామానికి చెందిన మొగలి లోవరాజుకు ప్రమాదవశాత్తు వెన్నుముక విరిగిపోవడంతో బాధితులు ఈ విషయాన్ని జనసేన నాయకుల దృష్టికి తీసుకురాగా వారు యువసేన ఫౌండేషన్ కాకినాడ వారి సహకారంతో వీల్ చైర్ ను, అదేవిధంగా జనసేన నాయకుల సహాయంతో నిత్యావసర సరుకులను జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వివరాలు కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, గొలకోటి వెంకన్న బాబు, దూడల స్వామి, గొలకోటి సాయి, షేక్ మస్తాన్, మాదాల శ్రీధర్, మాదాల మనీష్, మాదాల వంశీ, పాయసం సాయి తదితరులు పాల్గొన్నారు.