గోరంట్ల నాగరాజుకి మనోధైర్యాన్నిచ్చిన వాసగిరి మణికంఠ

గుంతకల్ పట్టణ ప్రముఖ పాత్రికేయుడు గోరంట్ల నాగరాజుని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ పరామర్శించడం జరిగింది. గత కొద్దిరోజులు క్రితం యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ ఇంట్లో ఉన్న గుంతకల్ పట్టణ పాత్రికేయ మిత్రుడు గోరంట్ల నాగరాజుని పర్యామర్శించి తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందించి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని వాసగిరి మణికంఠ భరోసానివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సీనియర్ నాయకులు కసాపురం నందా, సుబ్బయ్య, కథలగేరి అంజి, అమర్, అనిల్ కుమార్, లారెన్స్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.