హారర్ నేపథ్యంలో హిమజ “జ” ఫస్ట్ లుక్

తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హిమజ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సీరియల్స్‌తో ఆకట్టుకున్న హిమజ.. `బిగ్‌బాస్-3` రియాలిటీ షోతో మరింత మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు – బుల్లి తెర షోస్ – టీవీ సీరియల్స్ అంటూ వరుస ఆఫర్స్ తో బిజీగా గడుపుతోంది. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ లో కూడా హిమజ నటించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో హిమజ హారర్ సినిమాలో ప్రధాన పాత్ర చేయబోతోంది.  తాజాగా `జైదుర్గా ఆర్ట్స్` బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ హారర్ సినిమాకు ”జ” అనే టైటిల్ ని ఖరారు చేస్తూ దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.  `