జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే విధానం మార్చుకోవాలి

  • జనసేన మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)

మైలవరం: పవన్ కళ్యాణ్ పై బురధచల్లటమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని! ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఈ విధంగా మాట్లాడం సరికాదని అన్నారు. తాను విచక్షణ కోల్పోవడమే కాకుండా?తన పాలనలో ఉన్న మంత్రుల చేత ఏం.ఎల్.ఎ.ల చేత ప్రతిపక్ష నేతలపై అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నారని!నాయకుడు సరిగ్గా ఉంటే తన క్రింది నాయకులు, కార్యకర్తలు సరైన మార్గంలో నడుస్తూ ప్రజల అభిమానం పొందుతారని, ఆ విషయాన్ని మరిచి ప్రజలు అప్పగించిన బాధ్యతలను విస్మరించి, ప్రతిపక్ష నేతలపై బురద చల్లే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని నడిపించే నాయకుడే సరైన మార్గంలో నడవపోతే తనతో పాటు కలసి నడిచే వారు ఎ విధంగా సక్రమమైన మార్గంలో నడుస్తారాని అన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలింటిర్ల వ్యవస్థను పటిష్ట పరిచి, వారికి ప్రభుత్వ గుర్తింపును కలిగిస్తూ, వారికి రాజ్యాంగం ప్రకారం అన్ని వసతులు అనగా 15వేల రూపాయల వేతనంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. వాలింటిర్లను తమ ప్రభుత్వం కార్యక్రమాలకు ఉపయోగించకుండా, ప్రజలకోసం వినియోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు, ఉపాధ్యక్షులు పాములపాటి సుందర్ రామిరెడ్డి మరియు నాయకులు చంద్రాల మురళీకృష్ణ, కటకం ధర్మారావు, ఎర్రంశెట్టి నాని, మర్రి కొండలరావు, శీలం కృష్ణమూర్తి, దాసరి వెంకట శశికుమార్, శీలం చందు మరియు జనసైనికులు పాల్గొన్నారు.