సేనా వారాహి యాత్రకు సిద్దంకండి..

  • వారాహి యాత్ర కార్యాచరణ సమావేశం
  • సుమారు లక్షా యాభై వేల మందికి పైనే కత్తిపూడిలో జరగబోయే భారీ బహిరంగ సభకు రానున్న ప్రజానీకం అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్
  • పాయకరావుపేట నియోజకవర్గం నుంచి భారీగా తరలి రానున్న జనసైనికులు

పాయకరావుపేట నియోజకవర్గం: పాయకరావుపేటలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన వారాహి యాత్ర కార్యాచరణ సమావేశంలో బుజ్జి దిశానిర్దేశం చేసారు. సమావేశంలో భాగంగా యువతను ఉత్తేజ పరిచేలా యూత్ ఐకాన్ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పవర్ ప్రసంగించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సమన్వయ కర్తలు రాష్ట్ర కార్యదర్శి గడసాలా అప్పారావు మరియు మత్స్యకార విభాగ ప్రధాన కార్యదర్శి డా మూగి శ్రీనివాస్ నాలుగు మండలాల జనసైనికులకు వారాహి యాత్ర విజయవంతం చేయడానికి విలువైన సలహాలు సూచనలు అందించారు. అలాగే వారి ఈ కార్యక్రమానికి వారి పూర్తి సహాయ సహకారాలు వుంటాయని తెలియపరిచారు.