నమ్మించి మోసం చేయటంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడు

  • ఉద్యోగులకు ఏ మేరకు న్యాయం జరిగిందో వివరించి ఉద్యోగ సంఘ నేతలు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తే బాగుంటుంది
  • కార్మికులకు నాలుగు నెలలుగా ఆగిన హెల్త్ అలవెన్స్ లు వెంటనే విడుదల చేయాలి
  • జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: రాష్ట్రంలో ఎవరినైనా , ఎంతటి మేధావి వర్గాన్నైనా , వ్యాపారులనైనా , కార్మికులనైనా , ఉద్యోగులనైనా , సామాన్యులనైనా తన మాయమాటలతో నమ్మించి మోసం చేయటంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మించిన వారు ప్రపంచంలోనే లేరని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరణ చేసే విషయంలో జగన్ సర్కార్ ఆడుతున్న నాటకాలపై కాంట్రాక్ట్ ఉద్యోగులతో ,కార్మికులతో కలిసి ఆయన సోమవారం నగరపాలక సంస్థ ఎదురు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఉద్యోగులు తాము ఎదురుకుంటున్న సమస్యలపై పలుమార్లు ఏకరువు పెట్టినా పట్టించుకోని జగన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న వేల సరికొత్త డ్రామాలకు తెరతీసాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సుమారు లక్ష మందికి పైగా ఒప్పంద కార్మికులు ఉంటే అందులో పదివేల మందిని మాత్రమే క్రమబద్ధీకరణ చేసి చేతులు దులుపుకుంటే మిగతావారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 2014 జూన్ 14 నాటికి ఐదేళ్లపాటు సర్వీసు ఉన్నవారినే క్రమబద్ధీకరిస్తే ఆ తరువాత నుంచి విధులు నిర్వహిస్తున్న వారి భవిష్యత్ ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. ఉద్యోగులకు ఏ స్థాయిలో ప్రయోజనం చేకూరిందో పూర్తి స్థాయిలో వివరించిన తరువాతే ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే బాగుంటుందని ఉద్యోగ సంఘ నాయకులను సురేష్ కోరారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా హెల్త్ అలవెన్స్ లు అందకపోవడం శోచనీయమన్నారు. తమ విధులు మొత్తం మలమూత్రాల మధ్య చెత్తాచెదారాల మధ్య నిర్వర్తించే కార్మికులకు ఆరోగ్య భత్యాలు సక్రమంగా అందించకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సోమి శంకరరావు మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన అన్నిరకాలా ప్రయోజనాలను సక్రమంగా అందేలా చూడాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గెలిపించిన మాకు ఓడించటం కూడా తెలుసని కార్మికుల ఉసురు పోసుకోవటం వైసీపీ నేతలకు మంచిది కాదని శంకరరావు హితవు పలికారు. తొలుత హిమని సెంటర్ నుంచి హిందూ కాలేజీ వరకు కార్మికుల తో కలిసి జనసేన పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టాయి. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఆగిన ఆరోగ్య భత్యాన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా కమీషనర్ కీర్తి చేకూరికి వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్, జనసేన పార్టీ మహిళా విభాగం నాయకురాలు పార్వతి నాయుడు, నగర ఉపాధ్యక్షులు కొండూరి కిషోర్ కుమార్, చింతా రేణుకారాజు, ప్రధాన కార్యదర్సులు ఆనంద్ సాగర్, ఉపేంద్ర, నగర కమిటీ సభ్యులు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, మాదాసు శేఖర్, గడదాసు అరుణ, కవిత, అందె వెంకటేశ్వర్లు, సూదా నాగరాజు, రోశయ్య, సుంకే శ్రీను, షర్ఫుద్దీన్, బాలకృష్ణ, నరేష్, రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.