రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్న జగన్ రెడ్డి

  • అభివృద్ధి మరచి కక్ష సాధింపుల బాట
  • రాష్ట్రం దివాలా తీసేలా వైకాపా పాలన
  • త్వరలో జగన్ రెడ్డికి రాజకీయ సమాధి
  • జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

నార్పల: భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని జనసేన పార్టీ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో జనసేన నాయకులకు, కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రజానీకమంతా వ్యతిరేకిస్తోందని. దాదాపు 73 శాతం ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఎంతో సమయం లేదని ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధం కావాలని ఆయన జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన ప్రభుత్వం తీసుకురావడానికి క్రియాశీలక సభ్యులు పార్టీ కోసం ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల పాటు కష్టపడాలని సూచించారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు 50 నుంచి వంద మందిని ప్రభావితం చేసేలా తయారు కావాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో చింతా రామకృష్ణ, రహమతుల్లా, యశ్వంత్, కళ్యాణ్, అమీర్ ఖాన్, భాను ప్రకాష్, పవన్, గిరీష్, అశోక్, అన్సర్ బాషా, జగదీష్, షఫీ, బాలు తదితరులు పాల్గొన్నారు.