ప్రభుత్వ భూమిని ఆక్రమించు వారు దేశ ద్రోహులు

  • రాజా రెడ్డి మీద రెవిన్యూ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి
  • ఆ ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

కార్వేటి నగరం మండలం, గాజంకి గ్రామ పంచాయతీలో అమ్మ వారి గుంటకు అనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని(1.50 సెంట్లు) రాజా రెడ్డి అక్రమంగా ఆక్రమించి అనుభ విస్తున్నాడని కార్వేటి నగరం జనసేన మండల ఉపాధ్యక్షులు విజయ్ తెలిపారు. కార్వేటి నగరం మండల తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. రాజారెడ్డి అనుభవంలో ఉన్న అక్రమ ప్రభుత్వ భూమిని సర్వే చేసి, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఈ సందర్బంగా కోరారు. అలాగే రాజారెడ్డి పై రెవిన్యూ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించు వారు దేశ దోహులుగా గుర్తించాలని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించాలంటే భయం రావాలని, ఆ విధమైన చట్టం కూడా రావాలని అప్పుడే ప్రభుత్వ ఆస్తులు రక్షించబడుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి నరేష్ ఉన్నారు.