88వ వార్డ్ అధ్యక్షులుగా వబ్బిన జనార్దన శ్రీకాంత్ నియామకం

పెందుర్తి: మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాలిటీ సంబంధించిన 98 డివిజన్లకు అధ్యక్షులు నియమించడం జరిగింది. దీనిలో భాగంగా 88 వార్డ్ డివిజన్ కి సంబంధించి విద్యావంతుడు, యువ నాయుకుడు వబ్బిన జనర్ధన శ్రీకాంత్ ని నియమించడం జరిగింది. వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ 88 వార్డ్ అధ్యక్షులుగా నియమించినందుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 2016 సంవత్సరం నుంచి క్రియాశీలకంగా జనసేన పార్టీ ప్రతి కార్యక్రమంలో పాల్గొని, వార్డులో గాని నియోజకవర్గ స్థాయిలో ప్రతి సమస్యపై నా గలాన్ని వినిపించి జనసేన పార్టీ అభివృద్ధికి కష్టపడినందుకు ఈరోజు గుర్తించడం జరిగిందని. ఈ 88 వార్డ్ జనసేన పార్టీకి కంచుకోటని, గత ఎన్నికల్లో 4 వేలుపై చిలుకలు ఓటర్స్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుకి వేయడం జరిగిందని, నాలాంటి చదువుకున్న వాళ్ళకి, సమాజం మారాలని ఉద్దేశం ఉన్నవారందరికీ జనసేన పార్టీ ఒక మంచి వేదిక, నా ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో 88 వార్డ్ జనసేన పార్టీ అభివృద్ధిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అధ్యక్ష పదవినీ బాధ్యతగా అందర్నీ కలుపుకొని, ప్రజా సమస్యలపై పోరాడి మరింత జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, నాకు ఈ అవకాశం కల్పించిన విశాఖపట్నం అర్బన్ సమన్వయకర్త శ్రీ కోన తాతారావు గారికి, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *