జగన్ రెడ్డి అరాచకపాలన అంతమైంది

గుంటూరు, దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలుకానున్న నేపధ్యంలో రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సాగుతున్న వైసీపీ అరాచకపాలన అంతం అయిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుతోటలోని 60 అడుగుల రోడ్డులోని గాజు గ్లాసు దిమ్మె వద్ద బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం కొలువుతీరిందో ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారో ఆ క్షణం నుంచి రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందన్నారు. వైసీపీ ఆకృత్యాలతో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారన్నారు. ప్రజలిచ్చిన అధికారంతో వైసీపీ నేతలు కన్నుమిన్ను కానకుండా ఎన్నో దూరాగతాలకు, దాష్టీకాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగన్ రెడ్డి శాడిజానికి రాష్ట్రంలోని ప్రతీఒక్కరూ నరకాన్ని చవిచూసారని, ఎంతోమంది రాష్ట్రం వదిలిపెట్టి వలసలు వెళ్లిపోయారన్నారు. ఈ వైసీపీ దుష్పరిపాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలంతా వేయి కళ్లతో ఎదురుచూసారన్నారు. ఈ రోజుతో అన్ని వర్గాల ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటారని, కంటి నిండా నిద్రపోతారని ఆళ్ళ హరి అన్నారు. మే 13 న జరగనున్న ఎన్నికల్లో జనసేన-బీజేపీ-టీడీపీ, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకొని వైసీపీ పాలనలో ద్వంసమైన రాష్ట్రాన్ని పునర్ణించుకుందామని ప్రజలకు ఆళ్ళ హరి విజ్ఞప్తి చేసారు. రెల్లి యువత అధ్యక్షుడు సోమి ఉదయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, మెహబూబ్ బాషా, కోలా అంజి, షేక్ నాజర్ వలి, నండూరి స్వామి, శెట్టి శ్రీను, దాసరి రాము , కుమారస్వామి, బద్రిశెట్టి రాంబాబు, దాసరి రాము తదితరులు పాల్గొన్నారు.