స్కాముల కోసమే జగన్ స్కీములు: గాదె

గుంటూరు: రేపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో గాదె మాట్లాడుతూ పథకాల పేరుతో అధికార పార్టీ కోట్ల రూపాయల స్కాములకు పాల్పడుతుందని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిలా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు ఆరోపించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాలుగవ విడత వారాహి విజయ యాత్రను విజయవంతం చేయాలని జనసైనికులని కోరుతున్నాను. అవినీతి పునాదులపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని విమర్శించారు. రాజ్యాంగ ప్రతిపత్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటరీలకు ప్రత్యేక శిక్షణ పేరుతో కోట్ల రూపాయలు స్కాం చేసేందుకు సూట్ కేస్ కంపెనీలను రంగంలోకి దింపారని ఆరోపించారు. ఒక ప్రక్క విధ్వంసం మరో ప్రక్క సంక్షేమం అంటూ ప్రజలను గారడీ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం తప్ప ప్రజల బ్రతుకులు మార్చటానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కీలక మైందని ఆయన చెప్పారు. అధికార పార్టీ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే అవుతుందన్నారు అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, వస్తాయి, పోతాయి ముఖ్యమంత్రులు కూడా అంతేననిఎద్దేవ చేశారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు ఆందోళనలు చేస్తే తప్పేంటని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాలలో మార్పులు తీసుకు రావాలనే ఆశయంతో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజాల్లోనికి వస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు విరక్తి చెందారని అన్నారు. అధికార పార్టీకి తమపై తమకు నమ్మకం లేక, జగన్నన్న నీవే మా నమ్మకం, ఎందుకు ఏపీ కి జగన్ అవసరం, జగనన్న సురక్షా, లాంటి పేర్లతో ప్రజలపై వత్తిడి తీసుకు రావటం సిగ్గు చేటన్నారు. ప్రజలకు మంచి చేస్తే ప్రభుత్వంపై నమ్మకం ఉంటుందని చెప్పారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసామని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎవ్వరు పాలన చెయ్యలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలు ఉంటుందని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ రాక్షసత్వంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ విధానాలకు బుద్ధి చెప్పేందుకు జనసేనతో కలసి వారాహి యాత్రను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్, నగరం అధ్యక్షులు గోపరాజు ఉదయకృష్ణ, రేపల్లె రూరల్ అధ్యక్షులు జానకీ రామయ్య, మల్లి, జల్సా నాయుడు, జగదీష్, పూర్ణ, అంకమ్మరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.