రఘురామకృష్ణం రాజుకు జగన్ షాక్

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం ఎంపీగా ఎన్నికై సొంత పార్టీకే కొరకరాని కొయ్యగా తయారైన రఘురామ కృష్ణరాజుకు ఎట్టకేలకు ఆ పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేచర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామ కృష్ణరాజును తప్పిస్తూ లోక్‌సభ స్పీకర్ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా తన పదవికి ఎలాంటి ఢోకా లేదని చెబుతూ వస్తున్న రఘురామకు షాక్ తగిలింది. ఇక రఘురామకృస్ణం రాజు స్థానంలో వైసీపీ ఎంపీ బాలశౌరికి ఆ పోస్టును కట్టబెట్టారు. దీంతో ఇంతకాలం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ గా వ్యవహరించిన రఘురామకృష్ణంరాజు ఆ పదవి కోల్పోయినట్లైంది.

అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇన్నాళ్లు ఈ పదవితో కేంద్రంలో చక్రం తిప్పిన రఘురామకు వైసీపీ గట్టి షాక్ ఇచ్చినట్టైంది. ఇక ఆయనపై అనర్హత వేటు వేయించే దిశగా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.