ధుల్హన్ పథకం ద్వారా ముస్లిం ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి 1 లక్ష ఇస్తాం అని మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్..!

శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలం, రామచంద్రాపురం పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. పూలవర్షంతో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన జనసైనికులు. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. ధుల్హన్ పథకం ద్వారా ముస్లిం ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి 1 లక్ష ఇస్తాం అని మాట ఇచ్చి మడమ తిప్పాడని ముస్లిం మహళలు తెలిపారు, పండగలకి ఇచ్చే తోఫా కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదని తెలిపారు, గ్రామాల్లో త్రాగు నీరు లేదు, సి.సి.రోడ్లు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్రశేఖర్, నాయకులు తోట గణేష్, తేజ, దినేష్, రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, లక్ష్మి, రాజ్యలక్ష్మి, కవిత, శారద, హేమంత్ గౌడ్, పేట చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.