స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు జగన్: యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తూ పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే.. మా అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.. వేల కోట్లు అక్రమంగా దోచినందుకు కోర్టులకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కానీ ఏనాడైనా కౌలు రైతుల గురించి పట్టించుకున్నావా?. మా అధినేత తన సొంత కష్టార్జితాన్ని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని ఎఫ్.ఓ.ఏ అనే కంపెనీలో ఎందుకు ఉంది? ఆ కంపెనీ ఎవరిది?. వాలంటీర్లలో కొంతమంది మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు గురి చేయడం వివాహితుల కాపురాలు కూల్చడం నిజం కాదా? వీరి వేధింపులకు,అత్యాచారాలకు బాధ్యులు ఎవరు?. వాలంటీర్ల ద్వారా స్వీకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి, ఏ మంత్రి బాధ్యత తీసుకుంటారు?. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు వాలంటీర్ గా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. కౌలు రైతులకు వాలంటీర్ గా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రరాష్ట్రంలో ప్రజల సమస్యలను తీర్చేందుకు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ గా పనిచేస్తున్నారు తప్ప నువ్వు అన్న వాళ్లకు కాదు జగ్గు భాయ్. ప్రతి వ్యక్తి ఆధార్, బ్యాంకు వివరాల నుంచి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, ఎవరు ఎక్కడికి, ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు, అవివాహిత మహిళలు, ఒంటరి మహిళలు యువతులు వివరాలు, వారి ఫోన్ నెంబర్లు స్వీకరిస్తున్న మాట నిజం కాదా?.. మహిళలు, యువతులు వివరాలు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారు?. వాలంటరీలకు ఐడి కార్డులు కూడా లేవు అనేది వాస్తవం కాదా?. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న సీరియస్ విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని మరుగునపెట్టేందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత జీవితం గురించి అవాక్కులు చవాకులు పేలుతున్న జగన్ గురించి మేము కూడా మాట్లాడగలం. నీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కోల్కత్తాలో ఎవరితో ఏ టైప్ మీటింగ్ లో ఉన్నావో తెలుసు. బెంగళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాల చిట్టా అందరికీ తెలుసు. అక్కడి రాసలీల గురించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ – వైస్సార్సీపీ మంత్రుల గంట అరగంట వ్యవహారాలు తెలుసు.. ఆరాచకాలు బయటికి వస్తాయని ఇటీవలే కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర కీలక కాంగ్రెస్ నాయకుడికి ఎన్నికల ఫండ్ పేరుతో ఎన్ని వందల కోట్లు పంపించారు, ఆ డబ్బు తీసుకువెళ్లే బాధ్యతను ఏ ఉన్నత అధికారికి అప్పగించారు త్వరలో బయటపెడతాం. మీ ఇళ్లల్లో ఉన్నవారి అక్రమ సంబంధాలు, వాటి నేపథ్యంలో నేరాలు కూడా కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి కూడా నీతులు చెబుతున్నాడు. జగన్ నీకు లాగా మేము కూడా దిగజారి నీచంగా మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం ఉంది. మాకు మా అధినాయకుడు సంస్కారం నేర్పించారు అందుకే హద్దుల్లో ఉండి మాట్లాడుతున్నాము. 2024 ఎన్నికల్లో నిన్ను నీ వైస్సార్సీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. జగన్ నెక్స్ట్ పెట్టబోయే ఏ మీటింగ్లో అయినా వీటన్నిటికీ సమాధానం చెప్పు.. సమాధానం చెప్పలేక చేతకాక వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడితే నీ వ్యక్తిగత జీవితాల గురించి కూడా మేము మాట్లాడగలం కానీ మా సంస్కారం అడ్డొస్తుంది, కానీ మా ఓర్పు ఇంకా చాలా రోజులు ఉండదు, కానీ ఇంకొకసారి వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడితే మేము కూడా మీ వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడుతాము. పెడన నియోజకవర్గంలో జరిగే అక్రమ చెరువుల తవ్వకాలు, ఇసుక మాఫియాలపై “మన పెడన – మన నేల” అనే నినాదంతో రైతులతో కలిసి జనసేన పార్టీ తరఫున న్యాయపరంగా రైతులందరి సహకారంతో అక్రమ ఇసుక తవ్వకాలపై పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి ఒడుగు ప్రభాస్ రాజు, కృష్ణా జిల్లా కార్యదర్శి చంద్రమౌళి, పెడన టౌన్ నాయకులు కూనపరెడ్డి రంగయ్య, బంటుమిల్లి మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, బిసి సంక్షేమ సంఘం నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, జనసేన నాయకులు పుల్లేటి దుర్గారావు, క్రోవి సుందర రాజు, కృత్తివెన్ను మండల కార్యదర్శులు కొప్పినేటి నరేష్, కాజ మణికంఠ, కొప్పీనేటి శివమణి, బంటుమిల్లి కార్యదర్శి జన్యావుల నాగబాబు, గూడూరు మండలం కార్యదర్శులు పెన్నేరు మణికంఠ, కటకం మహేష్, గడ్డి గోపుల నాగ, కొఠారి మల్లి బాబు, కొలపల్లి చంద్ర శేఖర్, నందం శివ స్వామి, బాకీ నాని, దారపురెడ్డి నవీన్, బాలు మహేంద్ర, కొండ, సమ్మెట నాగేశ్వర రావు, చైతన్య, మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.