జగనన్న కాలనీలు పెద్ద మోసం

నెల్లిమర్ల నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా #Fఐలురెఓఫ్ఝగనన్నఛొలొన్య్ అనే హ్యాష్ ట్యాగ్ తో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార గ్రామం అయిన ముక్కాంలో, జగనన్న కాలనీల పరిస్థితి అగమ్యగోచరంగ ఉందని లోకం మాధవి తెలిపారు. ఆ ప్రాంతానికి పక్కనే ఆనుకొని ఉన్న హేచరీలు, నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పటికి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అనువుగా లేని రోడ్డు సదుపాయం. ప్రభుత్వం నుండి వచ్చే బిల్లులలో స్థానికి నాయకుల మొండి చెయ్యి అలానే, ఆ ప్రాంతంలో వారు ఇల్లులు కట్టుకోకపోతే వారి పథకాలు మరియు వారి రేషన్ కార్డును తీసివేస్తామని వైసిపి నాయకులు బెదిరింపులు. మత్స్యకారులకి అండగా నిలవడం అంటే ఇదేనా జగన్ రెడ్డి అని లోకం మాధవి ప్రశ్నించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని ధనాలపేట గ్రామంలో రెల్లి సోదరులకు కేటాయించిన జగనన్న కాలనీలు, రాయి ప్రాంతంలో ఇచ్చారు. అక్కడ సదును చేసి ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్రాంత ప్రజలు అధిక వడ్డీ చేసి తెచ్చిన సొమ్మును ఖర్చు పెట్టారని, వారికి ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఒక్క పైసా రాలేదు, సరైనటువంటి రోడ్డు మార్గం లేదు, నీటి కొరతతో సుదూర ప్రాంతాల నుండి ట్యాంకర్లు తెప్పిస్తున్నామని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం మండలం అధ్యక్షులు వందనాల రమణ, పల్లా రాంబాబు, జోగారావు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.