జగనన్నా అవి ఇళ్లు కావు, పేదలకు కన్నీళ్లు: పసుపులేటి

  • ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: జగనన్న ఇళ్లు పేదలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత రెండు రోజులుగా జనసైనికులు జగనన్న ఇళ్ల వద్ద చేసిన కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జగనన్న ఇళ్ల లే అవుట్ ల వద్ద చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. జనసేన చేసిన డిజిటల్ క్యాంపెయిన్ చూసైనా వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోవాలని సూచించారు. కనీస వసతులు కూడా లేకపోవడంతో చాలా మంది లబ్ది దారులు ఇళ్ల స్ధలాలను కూడా తీసుకోవడం లేదన్నారు. చిన్న వర్షం కురిసినా పేదలకు ఇచ్చిన స్ధలాలు చెరువులను తలపిస్తున్నాయన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లోనూ వైసీపీ నాయకులు భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. జనసైనికులు క్షేత్ర స్ధాయిలో పరిశీలిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఉన్న 66 మండలాల్లో ఇచ్చిన ఇళ్ల స్ధలాల వద్ద జనసేన నాయకులు, జనసైనికులు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. ప్రజా సమస్యల పట్ల జనసేన పార్టీ ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆధారాలు లేకుండా ఎలాంటి విమర్శలు చేసే పార్టీ జనసేన కాదన్నారు. అందుకే ప్రతి జనసైనికులు సమస్యలను క్షేత్ర స్ధాయిలోకి వెళ్లి తెలుసుకొన్నారన్నారు. జనసేన చేపట్టిన ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ఆయన అభినందలు తెలిపారు.