ఉత్తరాంధ్ర జనసేన ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

అనకాపల్లి: ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఝన్సీ లక్ష్మి బాయి 194 వ జయంతి సందర్బంగా వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి.శివ శంకర్, జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరియు పర్యావరణ వేత్త అయినా బోలిశెట్టి. సత్యనారాయణ, కార్పొరేటర్ పీతల.మూర్తి యదవ్, ఉత్తరాంధ్ర ప్రాంతీయ వీర మహిళల మెంబర్లు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా అనకాపల్లికి చెందిన వీర మహిళ దొండ కుసుమ సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించినందుకు ఆమెకు మన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, విరామహిళలు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి ఉత్తరాంధ్ర జనసేన పార్టీ తరపున దన్యవాదాలు తెలియజేయడం జరిగింది.