జగనన్న మోసం పేదవాడికి కన్నీళ్లు: అక్కల రామమోహన్ రావు

మైలవరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెనింగ్ లో భాగంగా మైలవరం నియోజకవర్గం, తేలప్రోలులో జగనన్న కాలనీలను మైలవరం నియోజకవర్గ జనసేన నాయకులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామమోహన్ రావు (గాంధీ) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం లక్ష యనబై వేలు ఇచ్చి పేద ప్రజలను ఇల్లు కట్టుకోమంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనికిరాని భూములలో ఒక సెంటు భూమి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటుంది 680 ఎకరాలకు గాను కేవలం 250 ఎకరాలు మాత్రమే ఇల్లు మొదలుపెట్టారు మిగిలిన 400 ఎకరాలు నిరుపయోగంగా ఉందని తెలియజేశారు. ఇక్కడ పేదలకు ఇచ్చిన కొన్ని స్థలాలలో ఇల్లు కట్టుకోనే పరిస్థితి కూడా లేదు. చిన్నపాటి వర్షం కురిస్తే ఫౌండేషన్ తో సహా కొట్టుకుపోయిన పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ కాలనీలలో వీళ్లకు ఇచ్చే అరకొర డబ్బులు లక్ష యనబై వేలలో కూడా జె టాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు చెప్పిందొకటి, ముఖ్యమంత్రి అయ్యాక చేసింది ఒకటి. అని మాట తప్పం మడం తిప్పం అని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. రోడ్డులు సరిగా లేకపోవటం వలన ఇసుక, సిమెంట్ తోలుకోవలన్న అధికంగా డబ్బులు అవుతున్నాయి అని ఇక్కడ ఇల్లు కట్టుకునే కొంతమంది చెపుతున్నారు.
ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే 9 నుంచి 10 లక్షలు దాక అవుతుందని చెపుతున్నారు. జోగి రమేష్ 100% ఇల్లు పూర్తయ్యాయని అన్నారు.. కానీ నిజానికి కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయని మేము ఆధారాలతో సహా నిరూపిస్తామని.. వైసిపి నాయకులకు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్మోహన్ రావు సవాల్ విసిరారు. జనసేన ప్రభుత్వం వచ్చాక పేదలందరూ అన్ని సౌకర్యాలతో వాళ్లు కోరుకున్నట్టుగా ఇల్లు కట్టించి ఇస్తామని, ప్రజలు తరపున జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని గాంధీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు, జిల్లా కమిటీ మెంబర్ చింతల లక్ష్మి, కొండపల్లి జనసేన నాయకులు రాగాల నాని, సాయి, సుజాత, ప్రవీణ్, జి కొండూరు మండల పార్టీ అధ్యక్షులు వై నరసింహారావు,
జనసేన పార్టీ నాయకులు బత్తిని శ్రీనివాస్, రామారావు, శ్రీను, సురేష్, ధర్మారావు, ఆదినారాయణ మూర్తి, నాంచారయ్య, కృష్ణారావు, సిరిపురం సురేష్, సాంబ, ఈశ్వర్, వెంకీ, చెల్లు కోటేశ్వరరావు, జాన్, నాగేంద్ర, పవన్, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.