జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు

  • నాలుగు సంవత్సరాలు గడిచినా లబ్ధిదారులకు న్యాయం చేయని వైనం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చిట్వేలి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిమ్మాయపాలెం పంచాయతీలోని గట్టుమీద పల్లెలో ఫెయిల్యూర్స్ ఆఫ్ జగనన్న కాలనీలో భాగంగా సందర్శించి డిజిటల్ క్యాంపియన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిట్వేలి మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ ఒక చిన్న స్థలంలో 5 నుండి 6 యూనిట్ లలో ఇంటి నిర్మాణం చేయాలనీ అంటున్నారు. కొండ, గుట్ట, గుంత, ప్రాంతంలో రోడ్లు కూడా వేయకుండా ఇంటి స్థలము మంజూరు చేసి ఇల్లు కడితే విడతల వారిగా 180000 డబ్బులు ఇస్తామని నిర్మాణం చెయ్యండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఒక్కో యూనిట్ ఇప్పుడు ఉన్న రేట్ల ని బట్టి చూస్తే దాదాపు 2లక్షలు ఖర్చు అవుతుంది. 6 యూనిట్స్ అంటే సుమారు 10 నుండి 12 లక్షలు కావాలి. మిగిలిన డబ్బులు అంత అప్పు చేసి నిర్మాణం చెపట్టాలి. బిల్లులు పెట్టాలంటే పనులు చేసి చూపించాలి డబ్బులు లేక వడ్డీలకు తెచ్చి కన్నీటి పర్వం తో ఇంటి నిర్మాణం చేపట్టవలసిన పరిస్థితి ఉందన్నారు, ఇల్లు నిర్మించకపోతే ఇచ్చిన స్థలము వాపసు తీసుకొంటాము అని వాలంటర్ బెదిరిస్తున్నారు అని లబ్ధిదారులు బాధపడుతున్నారని అన్నారు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్, తుపాకుల పెంచలయ్య, నాగిశెట్టి నాగేంద్ర, మాదాసు శివ, సువ్వారపు భాను, సుబ్బరాయుడు సువ్వారపు, మలిశెట్టి రమేష్, పొన్న రెడ్డి, సతీష్ రెడ్డి, తుపాకుల రవి, అద్దంకి సురేష్, సింగనమాల శివశంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.