అధిక పీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోండి: జనసేన

సత్యసాయి జిల్లా, ఓడీసీ మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ & కాలేజ్ లకు ప్రభుత్వం నిర్ణయించిన పీజులకంటే అధిక పీజులు వసూల్ చేస్తున్న స్చూల్స్ పై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారికి జనసేన నాయకులు వినతి పత్రం అందచేసారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణహించిన పీజులు మాత్రమే వసూల్ చెయ్యాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీజులు వివరాలు నోటీస్ బోర్డులో ఉంచాల్సిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నోటీస్ బోర్డ్ లో ఉంచడం లేదు ఇంత ఫీజులు ఎందుకు అని ప్రశ్నించిన తల్లిదండ్రులకు మా స్కూల్ లో సీట్లు లేవు అని సమాధానం చెప్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల జనసేన ద్రుష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ లలో నోట్ బుక్స్ విక్రయించ రాదు. కానీ ఒడిసి మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజీలలో కచ్చితంగా అదే స్కూల్లోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ.. వారు చెప్పిన రేట్లకు పుస్తకాలు కొనాలని డిమాండ్ చేస్తున్నారని.. అలాగే పుస్తకాలు విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు కూడా స్కూల్లో ఏర్పాటు చేశారని తల్లిదండ్రులు వాపోయారు అని తెలిపారు. ఓడీసీ మండలంలో ఉన్న స్కూల్ & కాలేజ్ లలో ప్రభుత్వం నిర్ణహించిన పీజు రెట్లను స్కూల్ లలో నోటీసు బోర్డులో పీజుల రేట్లు కూడా తల్లిదండ్రులకు తెలిసే విదంగా ఏర్పాటు చేసి.. ప్రభుత్వం నిర్ణహించిన రేట్లు కంటే ఎక్కువ పీజులు వసూలు చేస్తున్న స్కూల్ మరియు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కొండబోయన సతీష్, ధనుంజయ, లక్ష్మిపతి, ప్రసాద్,సద్దాం హుస్సేన్, అరిగేల శ్రీనివాసులు, రహంతుల్లా, రాజశేఖర్, భార్గవ్, గోవర్ధన్, రాజు జనసైనికులు పాల్గొన్నారు.