చిల్లపల్లి ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు

మంగళగిరి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహిస్తున్న జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 13వ తేది రెండవ రోజు దుగ్గిరాల మండలంలోని జగనన్న కాలనీని మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించి అక్కడ పరిస్థితులను ప్రభుత్వ పనితీరును తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… జనావాసం లేని, కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం, మౌళిక సదుపాయాలు లేని విష సర్పాలు సంచరించే పొలాల మధ్యలో, గుట్ట ప్రాంతంలో పేదలకు ఇల్లు నిర్మించి, కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించలేదని, ఈ కాలనీ చూస్తుంటే మోకాళ్ళ లోతు నీళ్లు ఒక చెరువు లాగా ఉందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి పేదలకు కట్టించిన ఇళ్లకు వచ్చి ఒకసారి చూసి వాళ్లకి ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలో కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), మంగళగిరి నియోజకవర్గ నాయకులు చిట్టెం అవినాష్, చంద్రశేఖర్ రావు (కె.ఎస్.ఆర్), చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, మంగళగిరి పట్టణ మైనార్టీ నాయకులు వజీర్ భాష, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.