గంగారపు రామదాసుచౌదరి ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదవారి కన్నీళ్లు

మదనపల్లి, జగనన్న ఇల్లు పేదలందరికి కన్నీళ్ల మదనపల్లె నియోజకవర్గఒ లో రాయలసీమ కో కన్వినర్ గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పేద ప్రజలకి ఇచ్చిన ఇళ్ల ప్లాట్స్ సందర్శించడం ధ్వరా తెలిసిన నిజాలు. మదనపల్లెకి మొత్తము 12850 ఇళ్ల పట్టాలు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో పూర్తి అయిన ఇల్లు 1700. కానీ పూర్తి అయిన వాటికి రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్ లైట్స్ 4 బలిబులు సింటెక్స్ ట్యాంక్ ఇస్తామని చెప్పిన జగనన్న ఇవ్వలేదు మదనపల్లె మునిసిపాలిటిలో గల అన్ని వార్డులకి పోతపోలు పంచాయతీ భుచేపల్లె దగ్గర దాదాపు 100 ఎకరాల లో 3800 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ పూర్తి అయినవి 30 కూడా లేవు గునాదికే 3 లక్షలు పైగా ఖర్చు అవుతుంది. 180000 రు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది పేదలు ఇల్లు ఎలా కట్టాలి అప్పు చేసి వడ్డీలు కట్టి ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇది జగనన్న మోసము కాదా ఆని జనసేన ప్రశ్న ?.చ్త్మ్ రోడ్డు లో ఎరగన్నాల మిట్ట దగ్గర టిడ్కో అపార్ట్మెంట్స్ కట్టారు ఇంతవరకు ఆలాట్ చెయ్యలేదు దాదాపు సింగల్ బెడ్ రూమ్ కి 12000 రు డబల్ బెడ్ రూంకి 24000 రూపాయలు దాదాపు 2000 మందికి పైగా ప్రజలు డబ్బు కట్టి మోసపోయారు. ఇలా ఊరికి చాలా దూరంలో ప్రజలకి ఇచ్చిన ప్లాట్స్ ఇల్లు కట్టేదానికి పనికిరావు. ఒక వేళ కట్టాలి అంటే 10 లక్షలు పైనే అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు పైగా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా లీగల్ అమరనారాయన మండల అద్యక్షులు గ్రానైట్ బాబు, ప్రధాన కార్యదర్శి జి.లోకేష్, వి నాగరాజు, ఐటి జగదీష్, వీర మహిళలు రెడ్డమ్మ, టైగర్ పద్దు, రేణుక, అర్జున కుమార్, రమణ, కృష్ణ, అఫ్రీజ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.