ముమ్మిడివరంలో జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు

ముమ్మిడివరం, నవంబర్ 12వ తేదీ నుండి జగనన్న ఇల్లు పేదల కన్నీరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, రాష్ట్ర రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయం వద్ద ముమ్మిడివరంలో ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న ఇళ్ళు, పేదల కన్నీళ్లు కార్యక్రమాన్ని, నియోజకవర్గంలోని నాలుగు మండలాలు అయినటువంటి కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ పోలవరం, తాళ్ళరేవు మండలాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కొరకు కొనుగోలు చేసిన భూములలో ప్రభుత్వ, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టిడ్కో ఇల్లు, జగనన్న కాలనీలలో మోసాలు జరిగాయని అన్నారు. కొన్ని కాలనీలలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని, కానీ ఇళ్ల స్థలాలు చూపించలేదని అన్నారు. జగనన్న రాజ్యంలో రాజ్యద్రోహం జరిగిందని, వెతికి తీస్తామని అన్నారు. జనసేన పార్టీ ఇప్పటివరకు రోడ్లపై నిరసన తెలియజేసి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు ముమ్మిడివరం మండలం బట్నవిల్లి శ్రీ విజయ దుర్గమ్మ ఆలయం వద్ద నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు, మధ్యాహ్నం కాట్రేనికోన మండలంలో జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమం, నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం ఐ పోలవరం మండలంలో మధ్యాహ్నం తాళ్లరేవు మండలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 14వ తేదీ సచివాలయాల వద్ద ఆడిట్ ప్రోగ్రాం నిర్వహిస్తామని అన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగిన లబ్ధిదారులు ఉంటే తమ దృష్టికి ఆ సమస్యలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గోదసి పుండరీష్, తాళ్ళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొల్లకోటి వెంకన్న బాబు, కాట్రేనికోన మండలం అధ్యక్షులు మోకా బాల ప్రసాదు, ఐ పోలవరం మండలం అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ముమ్మిడివరం టౌన్ కడలి కొండ, రాష్ట్ర సహాయక కార్యదర్శి జక్కంశెట్టి పండు నాతి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎల్లమెల్లి బాలరాజు నరహరిశెట్టి రాంబాబు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.