మామిడి రైతుల ఆవేదనను పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి: రెడ్డి అప్పలనాయుడు

  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జనసేన అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ఆంధ్రప్రదేలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న మామిడి రైతులను ఆదుకోవడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఉభయగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి నాయుడు ఆరోపించారు. సోమవారం ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో కారణంగా మామిడి రైతులు 85 శాతం పూర్తిగా నష్టపోయారని అన్నారు. ఏలూరు జిల్లాలో నూజివీడు, చింతలపూడి, నియోజకవర్గాల్లో ఎక్కువగా మామిడి రైతులు పంట నష్టపోయారని, రైతులను ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు, పంట నష్ట పోయిన రైతన్నలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిపించాల్సింది బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. అకాల వర్షాలు కారణంగా మామిడి రైతులు మామిడికాయలు రాలిపోయి, రాలిపోయిన మామిడికాయలు కుళ్లిపోయి మామిడి రైతాంగం ఉభయ గోదారి జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిందని, పంట నష్ట వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతన్న ఆదుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గాల శాసనసభ్యులు పై ఉన్నప్పటికీ, వారు మామిడి రైతుల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు సైతం పంట నష్ట వివరాలను సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వాణిజ్య పంటలైన, వరి, మామిడి, ఉద్యాన పంటల రైతాంగాన్ని ఆదుకోకుండా దున్నపోతుపై వర్షం కురిసినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నగేష్, పార్టీ నాయకులు 34 వ డివిజన్ ఎన్. శ్రీకాంత్, 17వ డివిజన్ నాయకులు వల్లూరు శ్రీకాంత్, 25వ డివిజన్ వరి కోటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.