ఇది జగనన్న ఇళ్ల పథకంలా లేదు ఇల్లు గుల్ల పథకంలా ఉంది: చేగొండి సూర్య ప్రకాష్

ఆచంట, జగనన్న కాలనీల పేరట ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెనుగొండ మండల “జగనన్న ఇల్లు- పేదలందరికీ కన్నీళ్లు” అనే కార్యక్రమం ద్వారా పెనుగొండ, మనుమర్రు, కొటాల పర్రు గ్రామంలో జగనన్న కాలనీ, ఇళ్ల సముదాయాలను పరిశీలన చేయడం జరిగింది. ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్రానికి తెలియజేసే ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనలతో పెనుగొండ, మనుమర్రు, కొటాల పర్రు లోని జగనన్న కాలనీలని పరిశీలించి ప్రస్తుత పరిస్థితి గురించి తీసిన ఫోటోలు, వీడియోలను డిజిటల్ మీడియాలో #ఝగనన్నంఒసం జగనన్నమోసం అనే హ్యాష్ టాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వ తీరును ఎండకడతామని తెలిపారు. పేదలందరి ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన గడువు ముగిసి 5 నెలలు కావస్తుంది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా పేదలకు మెజార్టీ పలు గ్రామాల్లో నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవు.

  • జగనన్న కాలనీలో భూసేకరణ పేరుతో దోపిడీ…

రాష్ట్రవ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ 10 నుంచి రూ 20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని 70 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు రూ 23,500 వందల కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయి. అలాగే మౌలిక సదుపాయాల కోసం మరో 34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు, కరెంటు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు అనేది కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే. ఈ ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుక మాత్రమే ఉచితంగా అందిస్తుంది అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని కండిషన్ పెట్టింది. ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడా నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడం లేదు అని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు కేవలం 5% ఇళ్లను కూడా కూడా నిర్మించలేదు. లబ్ది దారులకు ఇచ్చే 1,50,000/- కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదు. ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చింది, పేదలను ఎందుకింత దగా చేస్తున్నారు, ప్రజలకు ఈ వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ప్రధానంగా డిమాండ్ చేశారు. జగనన్న ఇల్లు పేరిట గత మూడున్నరఏళ్లగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనపై ఉంది. 2020లో పులివెందుల, కాకినాడ, విజయనగరంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు పైలాన్ వేశారు. గడువు దాటిన ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో టిక్కో ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్టర్ చేయడం లేదు. ఇళ్ల కోసం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక పేదలు చితికి పోతున్న ఇళ్లను మాత్రం కేటాయించడం లేదు. ఇది జగనన్న ఇళ్ల పథకంలా లేదు.. ఇల్లు గుల్ల పథకంలా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టిక్కో ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పిన మాట ఈ ముఖ్యమంత్రి కి గుర్తుందా? లేక ప్రజలే గుర్తు చేయాలా చెప్పండి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారుది. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజవర్గం ఇంచార్జ్ మరియు పిఏసి మెంబర్ చేగొండి సూర్య ప్రకాష్ మరియు మండల అధ్యక్షులు కంబాల బాబులు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ కొండవీటి శ్రీనివాస్, తోట సురేంద్ర, మండల టౌన్ ప్రెసిడెంట్ బాబురావు మునమర్రు మండల కమిటీ సభ్యులు నరసింహమూర్తి కొటాలపారు గ్రామ అధ్యక్షుడు ఆకుల సుబ్బారావు, ఆకుల ప్రసాదు, బళ్ల మాధవ నాయుడు, కాకి ప్రభాకర్, మరియు మండల కమిటీ సభ్యులు మంద నవీన్, దార్లంక మారుతి జనసేన వీర మహిళ బొరుసు కళ్యాణి, కామిశెట్టి మణికంఠ స్వామి, తోట సతీష్, పప్పప్పుల అంజిబాబు, పోడూరి రాజు, గుర్రాల సూర్యనారాయణ(సూరిబాబు) బొర్రా నాగేంద్ర, సూర్నీడి వెంకట్ స్వామి, సూర్నీడి సురేష్ స్వామి, బొరుసు సర్వేశ్వరరావు, ధర్మారావు, నూకల నాని, నూకల సాయి, నిమ్మకాయల ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.