పలాయనం చిత్తగించడానికి సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి!

  • జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం: రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదివారం తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మధుసూదన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ శనివారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దెందులూరు సభలో పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ముందు తను ఉత్తర ప్రగల్బాలు మాని పలాయనం చిత్తగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలు బుద్ధి చెప్పే సమయం చాలా దగ్గర పడిందని అలాగే రెండు టీ గ్లాసులు పంపిస్తాం ఆ గ్లాసుల్లో టీ తాగి ఉపశమనం కలిగించుకోవాలని, టీ గ్లాస్ తోనే వచ్చి మీ ఓట్లను కొల్లగొట్టి మీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి కృష్ణారెడ్డి మీరంతా దుష్ట చతుష్టయమని మీకు ప్రజలు 2 నెలల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.