వరద ముంపు గ్రామాలలో నాలుగవరోజు పర్యటనలో భాగంగా పశుగ్రాసం పంపిణి చేసిన పితాని

  • రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో పూర్తిగా విఫలం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, మండలం సలాది వారి పాలెం, పొడితిప్ప వలసల తిప్ప, శేరులంక, కమిని గ్రామంలో అలాగే ఐ. పోలవరం మండలం, పొగాకులంక, పల్లిపాలెం గోదావరి వరద ఉదృతికి గురైన గ్రామాలలోని పాడి రైతులకు 80వేల రూపాయలు పశుగ్రాసాన్ని అందించి మూగజీవుల ఆకలి తీర్చిన రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మమ్మిడివరం నియోజవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. అలాగే గ్రామాల్లో ఇళ్ల వద్దకెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయంలో పూర్తిగా విఫలం అయిందని బాలకృష్ణ అన్నారు. గ్రామాల్లో వరద బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం 2000 రూపాయలు ఇస్తానని అనడం చాలా విడ్డురం, లంక గ్రామాలలో వరద తాకిడికి ఇల్లు చాలవరకు దెబ్బతిన్నాయని 10,000 నుంచి 20,000 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. లంక గ్రామాల్లోని రైతులు పూర్తిగా నష్టపోయారని రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జున రావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, మద్దిశెట్టి పురుషోత్తం, గోలకోటి వెంకన్నబాబు, సాన బోయిన వీరభద్రరావు, దూడల స్వామి, లంకలపల్లి జమ్మి, మాదాల శ్రీధర్, నాతి నాగేశ్వరరావు, గంగ బత్తుల రాంబాబు, సలది రాజా, మణికంఠ, రాయపు రెడ్డి బాబి, ఆనంద్, ఇండుగుల రామకృష్ణ, ఉండ్రు సత్తిబాబు నరాలశెట్టి రాంబాబు, గెడ్డం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.