రోజుకో రత్నాన్ని పీకేస్తున్న జగన్మోహన్ రెడ్డి

మదనపల్లె, నిన్న ‘అమ్మ ఒడి’, నేడు ‘మత్స్యకార భరోసా’ పథకాలను నిబంధనలతో లబ్ధిదారులకు అందకుండా చేయడానికే నూతన నిబంధనలు. ఏపీలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చ లేక అనేక పథకాల పై జగన్ సర్కార్ కోతలు విధిస్తోంది. ఇప్పటికె అమ్మ ఒడి పథకం పై నిబంధనలు పెట్టిన జగన్ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం చేసింది. అదే వైయస్సార్ భరోసా పంపిణీ. గతంలో ఒకసారి 10000 అందుకున్న లబ్ది దారులు వేరే పథకాలు అందుకుంటే ఈ పథకం అందదని అనేక మందికి ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు. గుంటూరులో సగానికిపైగా లబ్ధిదారులు సంఖ్య తగ్గేలా ఉంది. మత్స్యకారుల ఇంట్లో ఎవరైనా 40 సంవత్సరాలు పైబడిన మహిళలు పెన్షన్ తీర్పు తీసుకుంటున్నా, మత్స్యకారుల ఇంట్లో ఎవరైనా అమ్మఒడి అందుకుంటున్నా.. మత్స్యకార భరోసా వర్తించదని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. కొత్త నిబంధనలు పై మత్సకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వాలి. హామీలను అమలు చేయని ప్రభుత్వం ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన తీరుపై తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్న జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.