భీమవరం జనసేన ఆద్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

భీమవరం: జగనన్న ఇళ్ళు పేదోళ్ళ కన్నీళ్ళు అనే సామాజిక పరిశీలనలో భాగంగా సోమవారం సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించి స్థానిక హౌసింగ్ ఆఫీస్ కి వెళ్లి ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ల పై సమాచారం కోరిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజవర్గ ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు భీమవరం నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇళ్లు ఎంతవరకు పూర్తయినాయి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు కనీస సౌకర్యాలు రోడ్లు, వాటర్ రిజర్వాయర్,కల్పించకుండా ప్రధాన రహదారులకు 5అడుగుల దిగువన నిర్మిస్తున్నారు. ఇలా నిర్మిస్తున్న ఇళ్లు మరో ఇందిరమ్మ గృహాల మాదిరిగా డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందిలకు గురవుతారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్ర శేఖర్, భీమవరం మండల అధ్యక్షుడు మోకా శ్రీనివాస్, సెక్రటరీ కత్తుల నీలేంద్ర, నాయకులు బండి రమేష్ కుమార్, ఎంపీటీసీ లు తాతపూడి రాంబాబు, ఆరేటి వాసు, మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు నాయకులు పుప్పాల సుబ్బారావు, ఆకుల శ్రీను, పంతం ప్రసాద్, ఉండవల్లి శీను, పెంటపాటి మురళి , పెదబాబు, కాళీ శేఖర్, కార్తీక్, యాతం రామకృష్ణ, గణేష్, మెల్ల వెంకటేష్, వీర మహిళ ఉడిసి మీనాక్షి తదితర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.