పొన్నలూరు జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

పెద్ద వెంకన్నపాలెం రహదారి ప్రమాదాలకు పుట్టిన ఇల్లు.
జగనన్న కాలనీలు చిల్లచెట్లతో నిండిన జగనన్న ఉద్యానవనాలు
వాగుల్లో, వంకల్లో, స్మశానాల్లో, ఊరికి దూరంగా, ఇచ్చిన జగనన్న కాలనీలు పొన్నలూరు మండలంలో ఇప్పటివరకు జగనన్న కాలనీలో ఒక్కటంటే ఒక్కటి కూడా గృహప్రవేశం జరగలేదు. ఒక్కో ఎకరం 5 లక్షల విలువ ఉంటే ఈ వైసీపీ నాయకులు మాత్రం 12 లక్షలు పెట్టి జగనన్న కాలనీ కోసం కొన్నారు. పొన్నలూరు మండలంలో పేదల ఆస్తిని ఈ వైసీపీ నాయకులు దోచుకుని దాచుకుంటున్నారు.

శనివారం పొన్నలూరు మండలంలో ఇప్పగుంట, ఎడ్లూరుపాడు, పెద్ద వెంకన్నపాలెం, చౌటపాలెం, గ్రామాల్లో పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ బృందం పర్యటించి పేదల కోసం ఇచ్చిన జగనన్న కాలనీలను సందర్శించండి జరిగింది.

జగనన్న కాలనీ పేరుతో పొన్నలూరు మండలంలో వైసీపీ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఒక్కొ ఎకరం 5 లక్షలు ఉంది, కానీ ఈ వైసీపీ నాయకులు ఒక్కొక్క ఎకరాన్ని 10 నుంచి 15 లక్షలు వరకు కొనుగోలు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో జగనన్న కాలనీ పేరుతో అత్యధికంగా అవినీతి జరిగింది. పొన్నలూరు మండలంలో ఎక్కువగా ఉంది. వాగుల్లో, వంకల్లో, స్మశానాల్లో, భూమి నాణ్యత లేని చోట, ఊరికి దూరంగా, విద్యుత్ సౌకర్యం లేని చోట, మంచినీటి సౌకర్యం లేని చోట, ఈ జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కనీసం పొన్నలూరు మండలంలో ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం చేయలేదు, అవినీతి కుంభకోణంలో పొన్నలూరు మండలం అగ్రస్థానంలో ఉంది. అభివృద్ధి శూన్యం ఇక్కడ, వైసీపీ నాయకులకు వారికి నచ్చిన వ్యక్తులకు వారి పార్టీకి చెందిన వ్యక్తులకు వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే జగనన్న కాలనీలో పేర్లు నమోదు చేయించుకోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని జగనన్న కాలనీలో అవినీతిని బయటకు తీసి, అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించాలని అదేవిధంగా రహదారులను నిర్మించాలని జనసేన పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది, ఆదివారం ఉదయం 10 గంటలకు పొన్నలూరు మండలంలో జగనన్న కాలనీ వద్ద మీడియా సమవేసం నిర్వహించదం జరుగుతుంది. ఈ సమావేసంలో పూర్తి వివరాలు మీడియాకు తెలియజేయడం జరుగుతుందని తెలియజేసారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పీటర్ రిషి, శ్రీను, భార్గవ్, మహేష్, నరేంద్ర, ఇమ్మానుయేల్, తిరుమల్ రెడ్డి, సుబ్రమణ్యం నాయుడు మొదలైన పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.