జనంతో “టీ” జనసేన

  • తాతల కాలంనాటి ఆస్తులపై మీ స్టిక్కర్లు, పెత్తనం ఏమిటి…??
  • ఇంటికి దిష్టి తీసిన విధంగా జగనన్న స్టిక్కర్లు
  • జనంతో “టీ” జనసేన
  • గాజు గ్లాసు గుర్తు విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లడమే లక్ష్యం
  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లె, జనంతో మమేకం కావడం, ప్రజా సమస్యలు గుర్తించడం, గాజు గ్లాసు గుర్తు విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లడమే లక్ష్యం కోసమే జనసేన కార్యక్రమంలో భాగంగా జనంతో “టీ” జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండు వాల్మీకి సర్కిల్ నందు జనంతో “టీ” జనసేన కార్యక్రమం నిర్వహించారు. టీ స్టాల్ వద్ద ప్రజలతో కలిసి టీ సేవిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.‌ జనంతో మమేకమై జనసేన పార్టీ గుర్తు గాజు‌గ్లాసు ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి జనంతో టీ జనసేన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు తెలుకునే జనంతో ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజా సమస్యలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వం అసమర్థ పాలనను ప్రజలు గ్రహించాలన్నారు. తాతల కాలం నాటి ఆస్తులకు జగన్ బొమ్మలు వేయడం దిష్టి తీయడం వలె ఉంటుందన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీకి రాష్ట్రంలోని ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి సురేంద్ర, నాయకులు గ్రానైట్ బాబు, పురం నగేష్, శంకర, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.