శ్రీ పరదేశి అమ్మవారి భూములను ఓరిశీలించిన జనసేన

పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండల పరిధిలో జీవీఎంసీ 79 వ వార్డు లంకెలపాలెం గ్రామ దేవత శ్రీ పరదేశి అమ్మవారి ఆలయానికి చెందిన రూపాయలు 100 కోట్ల విలువ చేసే 10.13 ఎకరాల భూములను వైసిపి నేతలు చేజిక్కించుకొని వ్యాపారాలు చేయడాన్ని జనసేన ఖండించింది. పార్టీ పిఏసి సభ్యులు కోన తాతారావు ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు ఆ భూములను పరిశీలించారు. దేవాదాయ శాఖ అధికారులు స్పందించని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు, గాజువాక నియోజకవర్గం జనసేన నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డ్ ఇంచార్జ్ గవర సోమశేఖరరావు, పెందుర్తి నియోజకవర్గం వీరమహిళ శ్రీమతి గొన్న రమాదేవి, 73వ వార్డ్ ఇంచార్జ్ ముమ్మన మురళి, పి వసంత్, మామిడి ధనరమేష్, జ్యోతి రెడ్డి, ఎర్రిపల్లి నూకరాజు, ముసలయ్య, సర్వసిద్ధి రాజు, గంట్ల రామారావు, మేడిశెట్టి విజయ్, శీరంశెట్టి వెంకటరావు, అప్పలరాజు, లోకేష్, ఎం శ్రీను, నారపిన్ని అప్పలరాజు, నక్కా చిన దేముడు, మింది నరేష్ గారు, గోపాలకృష్ణ, శీరం ప్రసాద్, అమరపిన్ని మోహన్, చిత్త లక్ష్మణ్, కరణం శ్రీను, రాజు, బొర్రయ్య మరియు ఇతర జనసైనికులు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.