జగన్ అన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు రెండవ రోజు

కదిరి: అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు జగన్ అన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి విచ్చేసి కదిరి మునిసిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న జగన్ అన్న కాలనీలను, గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించదలచిన జి+3 హౌసెస్ టిడ్కో ఇండ్లను పరిశీలించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడ్కోఇండ్ల నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో 80% పనులు పూర్తి చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ఇండ్లను పూర్తిగా పట్టించుకోకుండా జగన్ అన్న కాలనీల పేరుతో 1 రూపాయికే ఉచితంగా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని లబ్ది దారుల దగ్గర సింగల్ బెడ్ రూం డబుల్ బెడ్రూం కట్టిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తూ లబ్దిదారులే కట్టించుకోండి అని చెప్పడం దారుణం అని ఇంటి నిర్మాణం చెయ్యకపోతే ఆ ఇండ్ల పట్టాలను వెనక్కి తీసుకుంటామని అధికారులు వత్తిడి తెస్తున్నారు. ఈ జగన్ రెడ్డి చేస్తున్న మోసం కారణంగా నివాసానికి ఏమాత్రం అనుకూలమైన ప్రాంతాల్లో కాకుండా కొండల్లో గుట్టల్లో కేటాయించడం వల్ల అక్కడ నీటి వసతి,రోడ్డు సౌకర్యం లేదు.ప్రతి రోజూ ఇంటి నిర్మాణం కోసం నీటిని ట్యాంకర్లతో తెప్పిస్తున్నామని ఇంటి నిర్మాణం కోసం 400000₹ నుంచి 500000₹ రూపాయల దాకా ఖర్చు వస్తోందని ప్రభుత్వం ఇచ్చే 180000₹ ఏమాత్రం చాలటం లేదని లబ్దిదారులు వాపోతున్నారు అంతే కాకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఈ ముఖ్యమంత్రి వృదా చేస్తున్నారని,మీరు లబ్ది దాడులకు సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో జన సేన పార్టీ గెలుపు ఖాయం అని అప్పుడు జన సేన పార్టీ యే వీరికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మధుసూదన్ రెడ్డి మరియు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్ర శేఖర్, కదిరి నియోజక వర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ గారు మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని,స్థానిక ఎమ్మెల్యే పి.వి. సిద్దా రెడ్డిని, ప్రభుత్వం అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు చిల్లా మహేష్, కె.వి. రమణ, భూక్యా రవీందర్ నాయక్, జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు ఫయాజ్, కుటాల లక్ష్మణ, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ పొరకల రాజేంద్ర ప్రసాద్, లోకేష్, ప్రసాద్, హరి బాబు, రాజశేఖర్, రాజు, హరీష్ వాల్మీకి, కుమార్, శ్రీనివాస్, సాయి ప్రియ, దివాకర్ రెడ్డి, నాగేంద్ర మరియు జన సైనికులు పెద్దయెత్తున పాల్గొన్నారు.