Jaggayyapeta: మున్సిపాలిటీ ఎన్నికల నేపధ్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి జగ్గయ్యపేట పట్టణ జనసైనికుల మరియు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నేడు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కార్యచరణ గురించి మరియు వార్డు వారిగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, సీనియర్ నాయకులు ముత్యాల వెంకటశ్రీనివాసరావు, జగ్గయ్యపేట పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.