రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

  • ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిపై గెలవడమే లక్ష్యం
  • నియోజకవర్గంలో జల్లికట్టు నిర్వహించాలి
  • మండల సమస్యలను పరిష్కరించాలి
  • ఇనాం కొత్తూరులో జనంకోసం జనసేన కార్యక్రమం
  • యువశక్తి కార్యక్రమం తర్వాత నిరాహార దీక్ష
  • ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం మండలం ఇనాం కొత్తూరు పంచాయతీలో అయ్యన గారి పల్లి, ఇనాం కొత్తూరు, ఇనాం కొత్తూరు హవా, అయ్యన గారి పల్లి ఏఏడబ్ల్యు గ్రామాల్లో జనంకోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో నియోజకవర్గం ఇంచార్జి డా.యుగంధర్ పొన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో జల్లికట్టు నిర్వహించాలని అధికారులు సహకరించాలని, ప్రజా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పచ్చికాపల్లం నుండి కార్వేటినగరం వరకు, పచ్చికాపల్లం నుండి వయా వెదురుకుప్పం, కొత్తపల్లిమిట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని డిమాండ్ చేశారు. పచ్చికాపల్లం, మొరవ దేవలంపేటలలో వారపు సంతలు రోడ్లపైనే నిర్వహిస్తున్నారని, సురక్షిత ప్రాంతంలో షెడ్లు మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పచ్చికాపల్లంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వైయస్సార్ డిగ్రీ కాలేజీ నిర్మాణం త్వరితగట్టిన చేపట్టాలని తెలియజేశారు. వావిలి చేను, యనమల మంద సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం హామీకే పరిమితమైందనితెలియజేశారు. వెదురుకుప్పంలో మినీ స్టేడియం హామీ హామీగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులను నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల నుండి విముక్తి చేయాలని, భూ కబ్జాలను అరికట్టాలని, చెరువులు కుంటలు స్మశానాలను ఆక్రమణదారుల నుండి కాపాడాలని ఈ విషయంలో అధికారులు చొరవ చూపాలని, నకిలీ పట్టాలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. జీవో నంబర్ ఒకటి విడుదల ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం సర్టిఫికెట్లు మార్చుకొని పదవులు పొందిన జడ్పిటిసి కుమార్ కు నెమలిగుంట లో ఉన్న అంధులైన దంపతులు, దివ్యాంగులైన దంపతులు కనబడటం లేదా? వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయటానికి సమర్థత లేదా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దివ్యాంగులకు అందులకు న్యాయం చేయలేని చేతగాని వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మూట ముళ్ళు సర్దుకోవడం మంచిదని, ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతన్ ఎగరవేయటం ఖాయమని, ఈ నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గమే మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపుతుందని, ఇక మీ పాలన చాలని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. 2023 జెమిలి ఎన్నికలైనా, 2024 జనరల్ ఎన్నికలైనా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహేష్, మండల ఉపాధ్యక్షులు సతీష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ మహేష్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, వెదురు కుప్పం మండల ప్రధాన కార్యదర్శి రజిని, రాజు, కార్యదర్శులు హిమగిరి, దినకర్, కిరణ్, మరియు నాయకులు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, భాను ప్రసాద్, పాలసముద్రం మండల అధ్యక్షుడు లతీష్, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, ఎస్ఆర్ పురం మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్,చంద్రమౌళి, నరేష్, హరీష్, దేవేంద్ర, ఎస్ఆర్ పురం మండల్ ఐటి కోఆర్డినేటర్ మురుగేష్, కార్వేటినగరం మండల బూత్ కన్వీనర్ అన్నామలై, ఆరు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.