జగిత్యాల పట్టణ మరియు మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం

తెలంగాణ, జగిత్యాల నియోజకవర్గ పట్టణ మరియు మండల అధ్యక్షుల సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్ధన్ పట్టణ మరియు మండల నాయకులకు సూచనలిస్తూ మండలంలోని ప్రతి గ్రామాల్లోకి పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, బూత్ స్థాయి కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింత సుధీర్ జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు బొల్లి రామ్ మరియు రాయికల్ మండల అధ్యక్షులు కాసవెని మల్లికార్జున్ మరియు సారంగాపూర్ మండల అధ్యక్షులు తోకలా శ్రీధర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.