జనసైనికులకు జనసేన ప్రమాద బీమా చెక్కుల పంపిణీ

మార్కాపురం: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన మార్కాపురం నియోజకవర్గం మరియు యర్రగొండపాలెం నియోజకవర్గంలోని జనసైనికులకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మరియు యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంఛార్జ్ పాకనాటి గౌతమ్ ల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, పట్టణ నాయకులు, మండలాల నాయకులు, మార్కాపురం నియోజకవర్గ, యర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.