వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు : వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులకు నాంది పలుకుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. సోమవారం ఏలూరు పవర్ పేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి యాత్ర పోస్టర్ ను ఆయన సీనియర్ నాయకుడు బి.వి. రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14 వ తేదీ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనం అనంతరం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కత్తిపూడి నుండి యాత్రను ప్రారంభిస్తారన్నారు. ఈ యాత్ర కేవలం ఎన్నికల కోసమే కాదని, ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా యాత్ర కొనసాగుతుందన్నారు. వైసిపి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి నుండి గట్టెక్కడానికి జనసేన పార్టీ పరిపాలన రావాలని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్న తరుణంలో ఈ వారాహి యాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు. రాష్ట్ర పరిపాలన విధానంలో ఖచ్చితమైన జవాబుదారీతనం, ఒక జనసేన పార్టీకే సాధ్యమవుతుందన్నారు. రానున్న రోజులలో జనసేన పార్టీ సిద్ధాంతాలను నియోజకవర్గాల వ్యాప్తంగా, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా వారాహి యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన ఏలూరు నగర అధ్యక్షుడు నాగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలి శెట్టి శ్రావణ్ కుమార్, సరిది రాజేష్, వీరంకి పండు, దొసపర్తి రాజు, దుర్గారావు, హరీష్, నాగభూణం కుమార్, బోత్స మధు, బొండా రామానాయుడు, దోనేపూడి, పొన్నూరు రాము, తేజప్రవీన్, ఎట్రించి ధర్మేంద్ర, కందుకూరి ఈశ్వరరావు, వీర మహిళలు కుర్మా సరళ, కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమా దుర్గ, కోలా సుజాత, కే ప్రమీల రాణి, దుర్గ బి, తదితరులు పాల్గొన్నారు.