రాపర్తిలో దళిత వాడలో జనచైతన్యం

పిఠాపురం, చైతన్యవంతమైన దళిత యువకులను జనసేన పార్టీ వైపుగా నడపడమే లక్ష్యంగా, జనసేన పార్టీని ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయాలనే కుట్రతో చేస్తున్న విషపూరిత ప్రచారం తిప్పి కొట్టడమే ధ్యేయంగా పిఠాపురం రూరల్ జనసేన నాయకులు మరియు దళిత నాయకులు అయిన వాకపల్లి సూర్య ప్రకాశ్ పిఠాపురం రూరల్ మండల వ్యాప్తంగా మొదలు పెట్టిన దళిత వాడల్లో జనచైతన్యం కార్యక్రమం విశేషమైన ప్రజా స్పందనతో దిగ్విజయంగా కొనసాగింది. ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష మరియు కందరాడ జనసేన పార్టీ ఎంపీటీసీ పిల్లా దినేష్ ల సమక్షంలో కొనసాగింది. కార్యక్రమానికి ముందుగా జనసేన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించి స్థానిక దళిత క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందించిన అనంతరం పవన్ కళ్యాణ్ అభిమానులైన దళిత యువకులతో సమావేసమయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతిబింబించేలా అణగారిన వర్గాలకు రాజ్యాధికారం చేరువయ్యేందుకు ఉత్సాహవంతులైన పవన్ కళ్యాణ్ అభిమానులగు దళిత యువకులకు స్థానిక జనసేన పార్టీ నాయకత్వ భాగస్వామ్యం ఇచ్చేందుకు వాకపల్లి సూర్య ప్రకాష్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సదా అభినందనీయమని తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా తనకు అందిస్తామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ భావజాలాన్ని మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను స్థానిక యువకులకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ అధికార ప్రతినిధి తోలేటి శిరీష గత నుంచి జనసేన పార్టీ చేసిన అనేక సేవా కార్యక్రమాలను వివరిస్తూ సమ సమాజ స్థాపనకు నవ సమాజ నిర్మాణానికి జనసేన పార్టీ గెలుపు అత్యవసరమని అది బహుజనలు అందరూ సంకటితం అవడంతోనే సాధ్యమవుతుందని కావున వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి అంటే జనసేన పార్టీని గెలిపించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు అయిన వాకపల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ తను చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న జనసేన నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఊరిలో తనను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న జన సైనికులకు మరియు తన దళిత సోదరులకు కృతజ్ఞతలు చెప్పారు. తను ఎల్లవేళలా తన సోదరులకు అందుబాటులో ఉంటానని జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలకు అధికారం చేరవేసే పార్టీ అని ముఖ్యంగా తన సోదరులైన దళితులు ఈ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి అని వారికి ఏ విధమైన ఇబ్బందులు కలిగిన జనసేన పార్టీ అండగా ఉంటాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులైన వివేక్ కుమార్, జి.రాము, పి. దైవ, జీ.అరుణ్, పి.అనిల్, జి.బాలు, ఎం. సురేష్, వై.మహేష్, జి.సామ్యేలు, పి. స్వరూప్ రాజ్, ఎస్.అప్పన బాబు, జి. అశోక్, ఆర్.సతీష్, శాంసన్ తదితర దళిత సోదరులతో సమావేశమైన ఈ కార్యక్రమంలో దువ్వా వీరబాబు, కోన గనిరాజు, దువ్వ శివ వెంకటేష్, దేశినీడి నాని, వీరంరెడ్డి సునీల్, బ్రహ్మదేవు మణికంఠ, మొదలగు స్థానిక నాయకులు, గొల్లప్రోలు పట్టణ నాయకుడు మర్రి దొరబాబు, రూరల్ మండలం నాయకులైన తమ్మమాబోయిన సుదర్శన్ మరియు గంజి గోవిందరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.