పాడేరులో జనచైతన్య యాత్ర

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యురు మండలం, జనసేన పార్టీ మండల నాయకులు పాడేరు, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య ఆదేశాలతో జనచైతన్య యాత్రలో భాగంగా మాకవరం పంచాయితీ చింతలపూడి, పిట్టచలం, గింజర్తి, నల్లోగొండ పంచాయితీ కొప్పులకొండ, పనసలపాడు గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజలతో మమేకమవుతూ ప్రధాన సమస్యలు రోడ్డురవాణ, విద్య, వైద్యం, పంటల గిట్టుబాటు ధరలు పలు సమస్యలు వింటూ ప్రస్తుత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మార్పు తెచ్చే రాజకీయ వ్యవస్థ అవసరమని, గిరిజన ప్రజానీకానికి జనసేనపార్టీ మాత్రమే తగిన గుర్తింపు ఇస్తుందని, మండల నాయకులు ప్రజలకు వివరించారు జనసేనపార్టీ బలోపేతానికి మేమంతా కలిసి కట్టుగా కృషి చేస్తామని ఏ గ్రామానికి అడుగుపెట్టిన ప్రజల ఆదరణ అద్భుతంగా ఉందని, రానున్న సమీప ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని, మాకు ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకపోవచ్చు కానీ ఈ ప్రాంత గిరిజన జాతికి మేలు జరగాలంటే మాత్రం కేవలం జనసేనపార్టీతో మాత్రమేనని బలంగా విశ్వసిస్తున్నామని తెలుపుతూ… సిద్ధాంతలు, విలువలతో నిర్మితమైన రాజకీయ వ్యవస్థ కేవలం జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు. కొయ్యురు మండల నాయకులు చేపట్టిన జనచైతన్య యాత్రలో మాకు ఆదరించిన వివిధ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, ఈ సందర్బంగా మండల జనసేన నాయకులు చింతలపూడి గ్రామంలో ప్రాతినిధ్యం వహించిన బెణుకుల బాలు, బెణుకుల లోవరాజు, రాజేంద్ర, వాడపల్లి పవన్, మెడ దొరబాబు, మెడ లోవరాజు, జంపేరి శ్రీను, పొన్నాడ వాసు అలాగే నల్లగొండ పంచాయతీలో ప్రాతినిధ్యం వహించిన ఈశ్వరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. జనచైతన్య యాత్రలో సాగేని బుజ్జి బాబు, గూడెం లక్ష్మణ్, గోకిరి శ్రీనుబాబు, దుచ్చేరి రమేష్, పురా రాజేశ్, చిలక నాగార్జున నాగేంద్రబాబు, బాలరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.