జనసైనికుడు చంద బంగార్రాజు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు బాలారం గ్రామం: బుధవారం కత్తి పూడి లో జరిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొవడానికి సమావేశానికి కొయ్యురు బాలారం గ్రామానికి చెందిన జనసైనికుడు చంద బంగార్రాజు తిరుగు ప్రయాణంలో తుని సమీపంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కొయ్యురు జనసైనికులు, పాయకరావు పేట, నర్సీపట్నం, యలమంచిలి జనసేన పార్టీ నాయకులు చేరుకుని స్థానిక ఆస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న అరకు పార్లమెంట్ పాడేరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇన్చార్జ్ గంగులయ్య బంగార్రాజు స్వగ్రామం బాలారం చేరుకుని వారి కుటుంబం తో మాట్లాడుతూ వారికి పార్టీ తరుపున మీకు మా సహాయ సహకారాలు ఉంటుందని తెలిపారు. అలాగే ఒక మంచి జన సైనికుడిని, జనసేన కుటుంబ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమని ఇటువంటి సందర్భాలు ఎదురైతే ఒక కుటుంబం దిక్కు కోల్పోతుందని దయచేసి అధినేత జనసైనికుల సంక్షేమార్థం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఇన్సురెన్సు పాలసి తో ఆదుకునేందుకు ఒక చక్కని ప్రణాళిక చేసారని జన సైనికులందరు దయచేసి గమనించాలని అన్నారు. ఈ సందర్బంగా జన సైనికుడు బంగార్రాజు పార్ధీవ దేహానికి జనసేన పార్టీ జెండా పూలమాలలు వేసి నివాలర్పించి అంత్యక్రియలలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం ఆర్ధిక సహాయం చేసి మీకు అండగా జనసేన పార్టీ ఉంటుందని ధైర్యం కోల్పోవద్దని అన్నారు కొయ్యురు మండల జనసేన నాయకులు, కొయ్యూరు మండలం నుంచి సాగిన బుజ్జి బాబు, గూడెం లక్ష్మణ్, గోకిరి శీను బాబు, జుర్రా సూర్య ప్రకాష్, వాసా సాయిబాబు, సిహెచ్ సిద్దు, పొట్టికా, రాంప్రసాద్, పురా రాజేష్, కె.నాగేంద్రబాబు, కూడా దేవుడు, కూడా నరేష్, గూడెపు శేషుబాబు, చింతపల్లి మండలం నుంచి వినయ్, గోల్కొండ మండల అధ్యక్షులు గండెం దొర బాబు, జి. మాడుగుల మండల మాసాడి భీమన్న, జి. మాడుగుల మండలం వైస్ ప్రెసిడెంట్, సాగిన ఈశ్వరరావు పాల్గొన్నారు.