పవన్ కళ్యాణ్ ని‌ విమర్శించిన డిప్యూటీ సిఎం అంజాద్ భాషాకు జనసైనికుడు కొట్టే శ్రీహరి కౌంటర్

డిప్యూటి సిఎం అంజాద్ భాషా నిన్న కడప జిల్లా సిద్ధవటంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర విజయవంతం అవ్వడంతో జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలారు. ఆయనను సూటిగా ఆడుగుతున్న అయ్య కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వుండి కడప యువత కు ఉపాధి కోసం మీరు ఏం చేశారు మీరు మీ తప్పులను అడిగితే మీ మాట తప్పిన విధానాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తారా? కడప ఉక్కు పరిశ్రమను మూడు సంవత్సరాల్లో నిర్మిస్తాం అని మాట ఇచ్చి తప్పినందుకు ప్రశ్నిస్తే మీ పాలన వైఫల్యను ఎండ గడితే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తారా..? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటానికి షర్మిళ కష్టపడింది నిజం కాదా గెలిచాక ఆమెను పార్టీలో పక్కన పెట్టింది నిజం కాదా జగన్ రెడ్డి వాడుకొని వదిలేశారు అని అర్థం వచ్చేలా షర్మిళ ఒక ప్రముఖ మీడియా చానెల్ లో మాట్లడింది నిజం కాదా. ఈరోజు పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను ఆమ్మేస్తారు కాపులు అమ్ముడుపోతారు అని కాపులను అవమానపరుస్తు ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడటం చూస్తుంటే కాపులను వైసిపి వర్గశత్రువులుగా చూస్తున్నట్లు ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి ఉన్నప్పుడు పేద మైనారిటీ ఆడబిడ్డలకు ఉపయోగపడే దుల్హాన్ ఫథకం క్రింద గత ప్రభుత్వం రు.50 వేలు ఇస్తే నేను లక్ష ఇస్తాను అని ఎన్నికల హామి గుప్పించి మైనారిటీ సోదరుల ఓట్లు దండుకొని గెలిచిన తరువాత దుల్హాన్ ఫథకంను సిఎం జగన్ రెడ్డి ఎత్తివేస్తే జగన్ రెడ్డి ని ఈ విషయం గురించి అడిగితే ఎక్కడ పదవి పీకేస్తారో అని భయపడి కనీసం నోరు మెదపని వ్యక్తి మీరు అంజాద్ భాషా. మీరు మీ పదవి‌కోసం మైనారిటీ సోదరులకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఎంతోమంది కడపలో మైనారిటీ యువతకు స్థానికంగా ఉపాధిలేక ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ఏరోజు అయినా మీకు అండగా ఉన్న మైనారిటీ సోదరులకు మీరు అండగా ఉన్నారా..? మీ Yఛ్ఫ్ పార్టీ అండగా ఉందా? సొంత బాబాయి వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపిస్తే దానిపై విచారణ జరిపించమని సొంత చెల్లెలు సునిత రాష్ట కేంద్ర ప్రభుత్వాలను అడుగుతుంటే ఇంత వరకు ఎందుకు ఆ కేసుపై రాష్ట ప్రభుత్వం దృష్టి పెట్టలేదు ఎందుకు దోషులను పట్టుకోలేదు అని పవన్ కళ్యాణ్ అడగటం తప్పా ఇంట్లో వాళ్ళకే న్యాయం చెయ్యలేని సిఎం రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారు. పవన్ కళ్యాణ్ రాయలసీమలో పుట్టకపోయిన పెరగక పోయిన ఆయనకు రాయలసీమ అంటే ఎనలేని ప్రేమ రాయలసీమ యువత ఉపాధి వలసలు అరికట్టలని రాయలసీమ మళ్ళి రతనాల సీమ చెయ్యాలని అని అనుకుంటున్నారు. మరి మీరు రాయలసీమలో పుట్టి, పెరిగి రాయలసీమ ప్రజల ఓట్లతో గెలిచి ఏం చేశారు రాయలసీమకు అని అడుగుతున్న రతనాల రాయలసీమను రాళ్ళ సీమను చేసింది మన రాయలసీమ నాయకులు కాదా? ఈరోజు యువత ఉపాధి కోసం రాష్టలు దాటి దేశాలు దాటి వలసకు పోతుంది నిజం కాదా ఖచ్చితంగా మీకు రాజకీయంగా నూకలు చెల్లాయి ప్రజలు మిమ్మల్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టే రోజులు వచ్చాయని కొట్టే శ్రీహరి అన్నారు.