గాయపడిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆర్ధిక చేయూతని అందించిన జనసైనికులు

అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం జమాదులపాలెం గ్రామంలో గతంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఇద్దరు క్రియాశీలక సభ్యులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు ఆదేశాలకనుగుణంగా జమాదులపాలెం గ్రామ జనసేన పార్టీ తరపున జనసైనికుల సహకారంతో 10 వేల రూపాయలతో నిత్యావసరాలు, నగదు రూపంలో అట్టా నూకరాము, గూడుపు సన్యాసిరావు ల కుటుంబ సభ్యులకు అందించడంతో పాటు క్రియాశీలక సభ్యత కిట్లు కూడా అందించడం జరిగింది. అలాగే బాధితులను పరామర్శించి దైర్యంగా ఉండాలని, బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇవ్వడం జరిగింది. ఇందులో అట్టా రాము భార్య గతంలోనే చనిపోవడం ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అన్ని విధాలా మీకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం ద్వారా ఇద్దరు పిల్లలకి మరింత మనో దైర్యం కల్పించే ప్రయత్నం చేసాం. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యులు గూడెపు మణికంఠ, గ్రామ జనసేన పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు గూడుపు చిన్నారావు, అధ్యక్షులు కరణం శివకుమార్, ప్రధాన కార్యదర్శి శనివాడ లక్ష్మి (వీరమహిళ), గూడుపు రాము (ఆర్మీ), గూటూరి లోవరాజు, పాసిలి నూకరాజు, మడక అప్పారావు, గొన్న సోమునాయుడు, సేనాపతి శివ, కరక వెంకట రమణ, బొద్దపు శివ, గెంజి హేమంత్, మడక అప్పారావు మాస్టారు, బుదిరెడ్డి నర్సింహామూర్తి, పాసిలి గణేష్, పాసిలి యువరాజు, గూడుపు వెంకట గోవింద, నంబారి శ్రీను, గొన్నా చంటి, పడాల యస్వంత్ తదితరులు పాల్గొన్నారు.