గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన

నకరికల్లులోని శంకుస్థాపన ప్రాంతంలో జనసేన నిరసన ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ గోదావరి-పెన్నా అనుసంధానం కోసం 2018 లో చంద్రబాబు శంకుస్దాపన చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత పనులు జరగటం లేదు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్వంత నియోజకవర్గంలో ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ఉందనే విషయం అంబటికి తెలియజేయడం కోసం ఇక్కడకు వచ్చాం. అయ్యా అంబటి మీ నియోజకవర్గంలోని నీటిపారుదల ప్రాజెక్టు వైపు చూడండి. తక్షణమే ప్రాజెక్టు పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలి. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలి. పల్నాడు జిల్లాలో ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ, దమ్మాలపాడు ఎంపిటిసి సిరిగిరి రామారావు, అప్పారావు, మండల అధ్యక్షులు తోట నరసయ్య, లక్ష్మి, రాడ్లు శ్రీనివాసరావు, సిరిగిరి మణికంఠ, నెల్లూరు రాజేష్, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.