యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన జాని

పాలకొండ, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ తరపున పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయుకులు, జనసైనికులు, వీరమహిళల తరపున నా గ్రామం బొడ్లపాడు ప్రజలు అందరి తరుపున నూతన సంత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జగన్ రెడ్డి ప్రతి సంత్సరం జనవరి 1వ తేదిన జాబ్ క్యాలెండర్ తీస్తాను అని చెప్పి విద్యార్థులను నమ్మించి మోసం చేశారు అన్ని జాబ్ క్యాలెండర్లు వస్తున్నాయి గానీ జగన్ తీస్తామన్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు కనుక పవన్ కళ్యాణ్ జనవరి 12 వ తేదిన యువశక్తి కార్యక్రమం చేపడుతున్న సందర్బంగా పార్టీలకు అతీతంగా యువత పాల్గొని విద్యార్థుల యొక్క సమస్యలును తెలియజేయండని పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ తెలియజేయ్యడం జరిగింది.