ఎన్.డి.ఏ కూటమి గెలుపు కోసం జనసేన ప్రచారం

  • ఎన్.డి.ఏ కూటమిని గెలిపించండి- జనసేన ప్రచారం

కోనసీమ జిల్లా: అమలాపురం పట్టణంలో తెలుగు దేశం, జనసేన ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు నాయకత్వంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో 4,7 వార్డుల్లో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి తెలుగు దేశం అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల అనందరావు రావులకు “సైకిల్ “గుర్తుకు ఓటు వేయాలి అని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలప్రచారంలో జనసేన కౌన్సిలర్లు యేడిద శ్రీను, గొలకోటి విజయలక్ష్మి, గండి దేవిహారిక, పడాల శ్రీదేవి, తిక్కా సత్య లక్ష్మి, జనసేన చిందాడగరువు ఎమ్ పి టి సి మోటూరి కనకదుర్గ, తెలుగు దేశం నాయకులు వలవల శివరావు, నల్లా మల్లి బాబు, రవణంశుభాకర్, మాకిరెడ్డి పూర్ణిమ తదితరుల పాల్గొన్నారు.